మహబూబ్ నగర్ జనవరి 27 (ఈ బీ న్యూ స్);మహబూబ్ నగర్ పార్లమెంటులో 65శాతం కు పైగా ఉన్న బీసీలు పాలన పగ్గాలు చేపట్టడానికి అర్హులు కారా! అని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ప్రశ్నించారు. శనివారం పాలమూరు యూనివర్సిటీలో అడిగితే వచ్చేది శూన్యం పోరాడితేనే రాజ్యాధికారం గోడపత్రిక ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల పల్లకి మోసే కూలీలుగానే ఉండాలా బీసీలకు అన్యాయం చేసే రాజకీయ పార్టీలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీసీలు తగిన గుణపాఠం చెబుదామని బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 65 శాతం పైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం పాలనలో భాగస్వామ్యం లేకపోగా అగ్రవర్ణ రాజకీయ పార్టీలలో నామినేటెడ్ పదవులకు కూడా నోచుకోవడం లేదని సామాజిక న్యాయస్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు బీసీలకే కేటాయించాలని, రేపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా బీసీ లకే అవకాశం కల్పించాలని, డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు బీసీ జపం చేసిన కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు కూడా బీసీలకే అవకాశం కల్పించాలని, బీసీలకు అవకాశం కల్పించిన పార్టీకే బీసీసేన మద్దతిస్తుందని తెలిపారు. బీసీ వ్యతిరేక నిర్ణయం తీసుకునే పార్టీలకు ఓటమి తద్యమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోబీసీ సేన జిల్లా అధ్యక్షులు బాలస్వామి, గాలన్న, విద్యార్థి బృందం చిక్కొండ ఆంజనేయులు యాదవ్,అజయ్ బాబు, గొడుగు నరసింహులు, అశోక్ యాదవ్ మహేష్,భరత్ బాబు,అంజప్ప, శ్రీశైలం, నవీన్,తాయప్ప, సాయి తదితరులు పాల్గొన్నారు















