EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బీసీల ఆకాంక్షలను గౌరవించిన కాంగ్రెస్. కుల గణన తీర్మానమే మేలు చట్టంతో పనిలేదుకుల గణన పై త్వరలోనే మేధావులతో వర్క్ షాప్బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

హైదరాబాద్ ఫిబ్రవరి 17 (ఈ బీ న్యూ స్);తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సమగ్ర కుల గణన చేయడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆకాంక్షలను నెరవేర్చి బీసీల మనోభావాలను గౌరవించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అలాగే చారిత్రకమైన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి . డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, అలాగె బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లకు సమస్త సమాజం తరఫున అయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన నిర్వహించాలని రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో “బిసి కులగనణ సాధన విజయోత్సవల” ను పెద్ద ఎత్తున నిర్వహించారు. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాదులోని అలీ కేఫ్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు ఇంధులొ ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముందుగా శ్రీనివాస్ గౌడ్ ఇతర బీసీ సంఘాల నేతలు కలిసి జ్యోతిబాపూలే విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం విగ్రహం వద్ద వివిధ వృత్తులు చేసుకునే బీసీ కులాల వారికి మిఠాయిల పంపిణీ చేశారు.అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాల లెక్కలు తీయాలని బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని తాము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని బీసీల పోరాటాలను బీసీల ఆకాంక్షలను గౌరవించి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో సమగ్ర కులగనణ చేపడుతామని తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.సమగ్ర కులగనల తోనే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. అసెంబ్లీ తీర్మానంతో బీసీ కులాల లెక్కలకు చట్టబద్ధత కలుగుతుందన్నారు,అసెంబ్లీ తీర్మానాన్ని రాజకీయం చేయకుండా బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు, రాష్ట్రంలో సమగ్ర కులగన నిర్వహించడానికి మంత్రివర్గ తీర్మానం, అసెంబ్లీ తీర్మానం ఉంటే సరిపోతుందని, చట్టం చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా చట్టం చేయలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.బీసీ కుల లెక్కింపు ప్రారంభం నుండి ముగించే వరకు బీసీలంతా రాజకీయ పార్టీలకతీతంగా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు త్వరలోనే కులగణనపై బీసీలలో సామాజిక చైతన్యం అవగాహన పెంపొందించడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర, మండల కేంద్రాలు పర్యటిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తున్న దానిమీద బీసీ సంక్షేమ సంఘం తరఫున సలాహలు, సూచనలు ఇవ్వడానికి రెండు మూడు రోజుల్లోనే బిసి విద్యావేత్తలతో, మేధావులతో సమగ్ర కులగనన అంశంపై వర్క్ షాప్ నిర్వహిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ టీ బడే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూదాని సదానందం కార్యదర్శి జాజుల లింగం గౌడ్ బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ అధ్యక్షులు మాదేశి రాజేందర్ మహిళా నాయకురాలు స్వర్ణ గౌడ్ తారకేశ్వరి నాయకులు మహేష్ బిక్షపతి చారి కందుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు

 

 

Related News

Select the Topic
Scroll to Top