జడ్చర్ల ఏప్రిల్ 13 (ఈతరం భారతం న్యూ స్);బీసీల ఆశాజ్యోతి, బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ అని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి, కృష్ణ యాదవ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ 42వ వర్ధిoతిని పుర స్కరించుకొని బీసీ సేన ఆధ్వర్యంలో శనివారం నాడు జడ్చర్ల పట్టణం సిగ్నల్ గడ్డ దగ్గర. బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణయాదవ్, మాట్లాడుతూ బిసి కమిషన్ 2వ చైర్మన్ బిపి మండల్ కృషిఫలితంగానే35సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలురిజర్వేషన్లుపొందుతున్నారని పాలకుల కుట్ర ఫలితంగా రిజర్వేషన్లు 20శాతం దాటడం లేదని విద్యా, ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లను పాలకులు కేవలం ప్రకటనలకే పరిమితం చేసి 10 శాతం కూడా అమలు చేయడం లేదని అన్నారు. బిపి మండల్ నివేదికలోని నలభై సిఫారసులను అమలు చేస్తేనే బీసీలకు ప్రజాస్వామ్యంలో సంపూర్ణ భాగస్వామ్యం లభిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బిపి మండల్ కు భారత రత్న కేటాయించాలని ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు బోధించాలని జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు అయినప్పుడే బీపీ మండల్ కు నిజమైనవాళులర్పించినట్లు అవుతుందని అన్నారు.కార్యక్రమంలో MRPS సీనియర్ నాయకులు దగ్గుల బాలరాజ్, సామజిక వేత్త వడ్లని శేఖర్ యాదవ్ బీసీ సేన మండల అధ్యక్షులు బొలెమోని నిరంజన్, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్ బీసీసేన మండలప్రధాన కార్యదర్శి గొడుగు నర్సిములు, యాదయ్య యాదవ్ సత్యం, నాగ సాయిలు,బాలు నర్సిములు,శివన్న, రాము మహేష్,వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.















