హైదరాబాద్ జనవరి 26 (ఈ బీ న్యూస్);75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం నాడు ఖైరతాబాద్ లోని రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావుజాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేసారు.ఈ కార్యక్రమం లో జెండా వందనం చేస్తున్న రాష్ట్ర, సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, కిశోర్ గౌడ్, కార్యాలయం అధికారులు నోముల శ్రీనివాసరావు, ప్రసాద్ రావు, సతీష్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.















