1.4.2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధుశ్రీ, ఖమ్మం.
నగరంలోని 3టౌన్ పరిధి బోస్ సెంటర్ గ్రేయిన్ మార్కెట్ లో ఏర్పాటు చేసిన బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ముఖ్య కార్యకర్తల జిల్లా సమావేశం లో పాల్గొన్న భారతీయ జనత పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు .బీసీ కుల సంఘాల సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో బీసీ కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్టల వెంకట నర్సయ్య . ఖమ్మం జిల్లా అధ్యక్షులు రేఖ వెంకట సత్యనారాయణ యాదవ్ , ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకతి పాపారావు , రాష్ట్ర నాయకులు దొంతు జ్వాల నరసింహ రావు గౌడ్. మేకల నాగేంద్ర మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.















