బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గా గుజ్జ కృష్ణ ను తొలిగించినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కోఅర్దినేటర్ ఆర్.అరుణ్ కుమార్ విడుదలచేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త కన్వీనర్ ను త్వరలో ప్రకటిస్తామని తెలియ చేశారు. సంఘం నియమ నిబందనలకు కట్టుబడి ప్రతి ఒక సభ్యుడు భాద్యతతో, నిభద్దతతో ఉండాలని లేని పక్షంలో ఎట్టి వారినైనా తొలగించడానికైన వెనుకాదేది లేదని అరుణ్ కుమార్ హెచ్చరించారు.కాగా ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. ఆర్.అరుణ్ కుమార్ తొలగింపు చెల్లదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం లో ఒకవర్గం పేర్కొంటుండగా , ఆర్.అరుణ్ కుమార్ నిర్ణయం సరైనదేనని ఒకవర్గం పేర్కొంటుంది.వర్గవిబేదాలతో సంఘం ఎటు వైపు వెళుతుందో సంఘం జాతీయ అద్యక్షుడి పై ఆదారపడి ఉంటుందని సంఘం లోని పలువురు ముఖ్యులు పేర్కొంటున్నారు.