అంబర్పేట నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది.బుదవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ చంద్ర మోహన్ సమక్షంలో సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కోట్ల రామకృష్ణ గారు బీఆర్ఎస్ లో చేరారు. మరో కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ , నియోజక వర్గ పరిశీలకులు గండ్ర మోహన్ రావు, డివిజన్ ప్రెసిడెంట్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి అంబర్ పేట నియోజక వర్గ ఇంచార్జ్ చంద్ర మోహన్, సీనియర్ నాయకురాలు రెడ్డి పద్మావతి సమక్షంలో టిడిపి ఇంచార్జ్ అంబర్ పేట నియోజక వర్గ టిడిపి ఇంచార్జ్ ఆర్ ప్రవీణ్ కుమార్ ( బిల్డర్ ప్రవీణ్) బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు