హైదరాబాద్ ఏప్రిల్ 17 (ఈతరం భారతం న్యూ స్); “మానవసేవే మాధవ సేవ”గా భావించి సామాజిక బాధ్యతగా సిగురు రేణుక రవికుమార్ బోడుప్పల్ సూరజ్ నగర్ ,బొల్లిగూడెం,వెంకటరెడ్డి నగర్ చౌరస్తా చలివేంద్రాల ఏర్పాటు చేసి నిత్యం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్బంగా సిగురు రేణుక రవికుమార్ మాట్లాడుతూ మండు వేసవిలో 15వ డివిజన్ ప్రజలదాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. 2016 సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం తమ సొంత నిధులతో ఎండాకాలంలో బాటసారుల, వాహనదారుల దాహార్తిని తీర్చటం కోసం సూరజ్ నగర్ కమాన్,బొల్లిగూడెం చౌరస్తా, వెంకటరెడ్డి నగర్ చౌరస్తా,తదితర ప్రాంతాలలో ప్రజలందరి సహకారముతో చలివేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు.ప్రజలందరూ ఎండాకాలంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో రేణుక –రవికుమార్,సూరజ్ నగర్ గౌరవ అధ్యక్షులు శంకర్ , అంజయ్య ఎన్‌క్లేవ్ ప్రెసిడెంట్ నాగరాజు, డివిజన్ బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు ఆరోగ్య మేరి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాపాజీ, హరినాథ్ గౌడ్, తాలూకా శతృఘ్న, గణేష్ గౌడ్, విఎస్ఎన్ చారి, వెంకట్ నర్సు, బాబు రాజ్, బెజ్జం నాగేశ్వర్ రావు, సుధీర్ రవీందర్, మండల రవీందర్ , ఆర్.రాజేందర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీరాములు, ధయాకర్ రెడ్డి , మహేష్ మైధారి, రాజేంద్ర ప్రసాద్, విధుర్, విజయ్ తదితరులు…పాల్గొన్నారు.















