ఈతరంభారతం భద్రాద్రి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 9,2024 : భద్రాద్రి జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 17 న జరగనున్న రామయ్య కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబయింది. వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈసారి లక్షలాది మంది భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలి వస్తారని అధికారులు అంచనావేసి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు . ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి రావాలని దేవస్థానం అధికారులు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు పంపించారు.















