చౌటుప్పల్ ఏప్రిల్ 13 (ఈతరం భారతం న్యూ స్);ఉగాది పర్వదినం పురస్కరించుకొని శ్రీ పాలకూరల శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ లోని తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాలలో శ్రీమద్రాంధ్ర భారత పద్య కంఠస్థ పోటీలు, పద్య తరంగిణి, తెలుగు భాష మాధుర్యం పై సదస్సు నిర్వహించారు. ప్రకృతిని ప్రేమిద్దాం ఉగాది పర్వదిన పరమార్ధం వివరణ కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమకు పాఠశాల ప్రిన్సిపాల్ కే సరోజ అధ్యక్షత వహించారు. భావన ఋషి కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షులు కళాకారులు సాహితీవేత్త బడుగు శ్రీరాములు ముఖ్య వక్తగా ప్రముఖ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన తెలుగు భారత భాగవతాలు మన సంస్కృతి జీవన మార్గదర్శకాలు అని అన్నారు. భారత ఆధ్యాత్మిక వైజ్ఞానిక సాంఘిక రాజకీయ సాంస్కృతి సాంప్రదాయాల సంపూర్ణ సంపూర్ణ జీవన చిత్రానమే మన భారత భాగవతాలు మన్నారు. ఈ ఉగాది పర్వదినమున తెలుగు భాషకు పట్టాభిషేకం చేద్దాం తెలుగు పరిమళాలను చేద్దాం అని పిలుపు నిచ్చారు ప్రపంచంలోనే అన్ని భాషల కెల్లా తెలుగు అత్యంత మధురమైనది. విశ్వభాషల కెల్లా మధురమైనది మన తెలుగు భాష అన్నారు .ఈ కార్యక్రమం పోషకులు పిఎస్విజి ఫౌండేషన్ చైర్మన్ పాలకూర్ల మురళి గౌడ్ మాట్లాడుతూ భారత భాగవతాలలో మన జీవన ప్రస్థానంలోని అన్ని సమస్యలకు సమాధానాలు లభించునని అన్నారు. పద్య తరంగిణి విజేతలు కీర్తన, శివాని, పి స్రవంతి, పి అక్షయ, బి శ్రీజ, పి సుతికే, కల్పన ,కార్తీక, హేమ, మనస్వి, తెలుగు భాష తెలుగు భాష మాధుర్యం ఉపన్యాస పోటీలు విజేతలు నవ్యశ్రీ, శివమయి, శ్రీమద్విత కంఠస్థ విజేతలు సిహెచ్ సింధు, అక్షిత, తన్మై, లక్ష్మి ప్రణతి, దేవి శ్రీ, స్రవంతి, మోక్షిత, భవాని లకు శ్రీ క్రోధినామ ఉగాది పురస్కారమును పాఠశాల ప్రిన్సిపాల్ కె సరోజ అందజేశారు.















