EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భారత రాజకీయాలపై జాతీయ సదస్సు

హై దరాబాద్, ఫిబ్రవరి 9 (ఈ బీ న్యూస్): ‘ ఎమర్జింగ్ డైమెన్షన్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ‘ అనే అంశంపై ఫిబ్రవరి 9,10 తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సును ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల బేగంపేట -హైదరాబాద్, రాజనీతి శాస్త్ర విభాగం నిర్వహిస్తున్నది. కళాశాల ప్రిన్సిపాల్,డా.కె.పద్మావతి అధ్యక్షతన శుక్రవారం నిర్వహింపబడిన ప్రారంభ సమావేశానికి అతిథులుగా ఉన్నత విద్యా మండలి ఛైర్మన్- ప్రొఫెసర్ లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుl ప్రొఫెసర్ రవీందర్ హాజరయ్యారు. భారత రాజకీయాల్లో వస్తున్న పరిణామాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని,ఈ ఆలోచన ధారను యువతకు అందించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సదస్సు నిర్వాహకులు డా.రామాచారి, డా.కమల, డా.నర్సింలు అభినందించారు. విద్యా సాధన లోనూ, విద్యార్థి ఉపాధి కల్పన లోనూ, బేగంపేట కళాశాల ప్రత్యేకత కలిగిందని, ఇందుకు కృషిచేస్తున్న ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులను అభినందించారు.

Related News

Select the Topic
Scroll to Top