EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భారత సంస్కృతీ సాంప్రదాయాల్లో చేనేత ఒకటి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 

యాదాద్రి భువనగిరి డిసెంబర్ 20 (ఈతరం న్యూ స్): చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తుందన్నారు. పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల వస్త్రాలకు టీఐజీ ట్యాగ్ రావడం అభినందనీయమని కొనియాడారు. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగిందన్నారు. భారత సంస్కృతీ సాంప్రదాయాల్లో చేనేత ఒకటన్నారు. భూధాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమని చెప్పుకొచ్చారు. చేనేత వస్త్రాల కృషి గొప్పది, కళను వారసత్వంగా మరొకరికి అందించడం గొప్పదన్నారు. చేనేత రంగాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలని తెలిపారు. చేనేత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. తమ ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు.

Related News

Select the Topic
Scroll to Top