తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఈ నామినేషన్ కార్యక్రమానికి భువనగిరి పట్టణం అన్ని వార్డుల నుండి ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ శ్రేణులు అత్యధిక సంఖ్యలో తరలి రావడంతో పట్టణంలో సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు గ్రామ శాఖ మండల శాఖ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ సేవాదళ్ విభాగాల నాయకులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. గత 30 ఏళ్ల నుండి కాంగ్రెస్ కు ఎమ్మెల్యే లేకపోవడం ఈసారి ఎలాగైనా గెలిపించుకోవాలన్నా పట్టుదలతో అన్ని గ్రామాల నుండి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
















