EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భువనగిరి నియోజకవర్గం బీ ఆర్ఎస్ అభ్యర్థిగా పైల శేఖర్ రెడ్డి నామినేషన్ అధిక సంఖ్యలో వడాయిగూడెం గ్రామస్తులు

భువనగిరి నియోజకవర్గం బీ ఆర్ఎస్ అభ్యర్థిగా ఈరోజు శాసనసభ్యుడు పైల శేఖర్ రెడ్డి ఈరోజు తన నామినేషన్ దాఖలు చేశారు.భువనగిరి పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల నుండి మండల కేంద్రాల నుంచి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గులాబీ శ్రేణులన్నీ బోనగిరి పట్టణానికి చేరుకోవడంతో పట్టణమంతా గులాబీమయం అయింది. భువనగిరి పట్టణానికి అతి సమీపంలో ఉన్న వడాయి గూడెం గ్రామం నుండి గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పట్టణానికి తరలి వెళ్లారు. ఉత్సాహంగా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. తమ గ్రామ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్న పైల శేఖర్ రెడ్డి గారికి తమ గ్రామం నుండి అత్యధిక మెజారిటీ రావడానికి తమ వంతు కృషి చేస్తామని సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ తెలిపారు

Related News

Select the Topic
Scroll to Top