EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

 భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం

ఆళ్లగడ్డ మే15 (ఈతరం భారతం న్యూ స్); నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్‌ మరో వ్యక్తితో మాట్లాడుతూ నిలబడి ఉండగా.. దుండగులు ఆయనను కారుతో ఢీకొట్టారు.దాంతో ఎగిరి కిందపడ్డ నిఖిల్‌ లేచి పరుగెడుతుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో వెంటపడి దాడి చేశారు. నిఖిల్‌ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లడంతో దుండగులు పారిపోయారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు.గతంలో నంద్యాలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై నిఖిల్‌ దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వర్గీయులు తిరిగి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో నేతల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏవీ సుబ్బారెడ్డి, చంద్రతోపాటు మరో నలుగురిపై ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top