EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మంచి ప్రభుత్వ వైద్యశాల నిర్మాణం చేపట్టాలి …రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

5.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత(ఈ బీ న్యూస్)భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మంచి ప్రభుత్వ వైద్యశాల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మంత్రి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి, కళాశాల స్థలం, వసతుల కల్పన లను తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరగా ఉందని, నూతన కలెక్టరేట్ నిర్మాణం జరిగినందున, అప్పుడు పాత కలెక్టరేట్ లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. రూ. 10 కోట్లతో పాత కలెక్టరేట్ కు రెన్నోవేషన్ పనులు, వసతుల కల్పన చేపట్టి, మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించడం జరుగుతున్నదని ఆయన తెలిపారు. భవిష్యత్తులో రెండో సంవత్సరం మరో వంద మంది విద్యార్థులు రానున్నట్లు, వసతుల దృష్ట్యా భవిష్యత్ అవసరాలకు అనుకూలంగా ఉందా లేదా అధికారులు పరిశీలన చేయాలన్నారు. రూ. 108 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి వివిధ భవనాలు వస్తాయని, వాటన్నిటికి కావాల్సిన స్థలం, స్థలాన్ని ఎలా సర్దుబాటు చేయాలో ఆలోచన చేయాలన్నారు. భవిష్యత్తులో మంచి కళాశాలకు కావాల్సిన వసతులన్ని ఉండాలి కాబట్టి కలెక్టర్, వైద్య కళాశాల అధికారులు మాట్లాడి, రాబోయే తరాలకు అన్ని వసతులతో మంచి వైద్య కళాశాల అందించేందుకు కార్యాచరణ చేయాలన్నారు. ప్రస్తుతం పాత భవనంలో తరగతులు జరుగుచున్నాయని, మరొకసారి క్రొత్త భవనాలకు స్థలాన్ని పరిశీలించి, తదుపరి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వ వైద్యశాల కు సంబంధించి, అన్ని వివరాలు తెలుసుకోవడానికి క్షేత్ర పరిశీలన చేసినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రాములు నాయక్, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. సి. సరిత, ఆర్ అండ్ బి ఎస్ఇ శ్యామ్ ప్రసాద్, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, కళాశాల వివిధ విభాగాల అధికారులు డా. ఎల్. కిరణ్ కుమార్, డా. బి. బాబు రత్నాకర్, డా. రాథోడ్ వినాయక్, డా. ఎం. రాధిక, డా. బి. దివ్యదర్శిని, డా. డి. చండిప్రియ, డా. జి. కరిష్మ, ఆర్ఎంఓ లు డా. బి. అమర్ సింగ్, డా. బి. రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top