EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మంత్రిహరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బిజెపి ప్రముఖులు

 

హైదరాబాద్ నవంబర్ 17 (ఈతరం ఇండియా న్యూ స్);ప్రజల అభిమానంతో అంబర్ పేట లో కాలేరు విజయం కన్ఫామ్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సమక్షంలో మాజీ బిజెపి కార్పొరేటర్ మరియు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వనం రమేష్, శ్రీ మతి వనం మాలతి, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్,హైదరాబాద్ సెంట్రల్ జిల్లా సెక్రెటరీ శ్రీ కత్తుల సుదర్శన్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రివర్యులు హరీష్ రావ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, అంబర్ పేటలో కన్ఫామ్ గా కాలేరు వెంకటేష్ తిరిగి గెలవడము పక్కా అని అన్నారు. అంబర్పేటలో కాంగ్రెస్ బిజెపిలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని, మంచి మెజారిటీతో కాలేరు వెంకటేష్ విజయం సాధించే బోతున్నారని ఆయన అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top