కాంగ్రెస్ ఇచ్చిన కరెంట్‌ను బీఆర్ఎస్ కొనసాగిస్తోంది
‘‘ఉమ్మడి రాష్ట్రంలో మేము ఇచ్చిన కరెంట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించడం లేదా..? అప్పట్లో కరెంట్‌ను కొందా మన్న కూడా లేని పరిస్థితి ఉండేది. మేము ఇచ్చిన 7, 8 గంటల కరెంట్‌ను ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఇస్తోంది. కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఉత్పత్తికి కృషి చేసింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది అంటున్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ హయాంలో 6.5 శాతం తలసరి ఆదాయం పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో ఏళ్ల తలసరి ఆదాయం కంటే మేము చేసింది ఎక్కువ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పులు చేశారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 5 లక్షల 50 వేళా కోట్ల అప్పు చేయలేదా..? మేడిగడ్డపై పూర్తిగా అధ్యయనం చేస్తాం. ఆ తర్వాత మాట్లాడతా. బీఆర్ఎస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది’’ అని జానారెడ్డి మంత్రి కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.















