EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మంత్రి జగదీశ్ రెడ్డి ఇలాఖా లో బిఆర్ఎస్ కు రోజుకో షాక్

సూర్యాపేట,నవంబర్ 13 (ఈతరం ఇండియా న్యూస్ ); మంత్రి జగదీష్ రెడ్డి ఇలాఖా సూర్యపేటలో బీ ఆర్ఎస్ కు రోజుకు ఒక షాక్ తగులుతుంది. నియోజకవర్గంలోని13 వ వార్డు కాంగ్రెస్ పార్టీ (బాషా నాయక్ తండా) బానోతు నర్సింహ నాయక్ ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 మంది బిఆర్ఎస్,బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా 4వ వార్డు ఖాసీంపేట బిఆర్ఎస్,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలోని పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు, కాంగ్రెస్లో చేరడానికి ఆసక్తి చూపెడు తున్నారని తెలిపారు. సూర్యాపేట తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలవబోతున్నామని రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఆయన అన్నారు

Related News

Select the Topic
Scroll to Top