EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మంత్రి పొంగులేటి ఉగాది శుభాకాంక్షలు

 

ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

తెలుగువారి నూతన ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని.. ఉభయ జిల్లాలు, రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరానికి .. సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుదామని పేర్కొన్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడిలోని తీపి, చేదు మాదిరిగానే.. కష్టం, సుఖం అనేవి జీవితంలో సహజమని తెలిపారు. కొత్త తెలుగు సంవత్సరంలో అంతా శాంతంగా సాగాలని, ప్రజలందరికీ మంచి జరగాలని, అంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజలతో అందరూ ఉగాదిని ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

Related News

Select the Topic
Scroll to Top