హైదరాబాద్ నవంబర్ 10 ( ఈతరం ఇండియా న్యూస్)మతతత్త్వ, నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్న మజ్లిస్ పార్టీ నుంచి కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి విముక్తి లభించాలంటే ప్రతీ ఒక్క ఓటరు కమలం పువ్వు గుర్తుకే ఓటేసి బీజేపీ ఎమ్మెల్యేగా తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కార్వాన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి టి అమర్‌సింగ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మేరకు శుక్రవారం అమరసింగ్ తలపై ధరించి కార్వాన్, జియాగూడ మేకలమండీ, న్యూగంగానగర్ తదితర ప్రాంతాలలో ఇంటింటికీ తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకే ఓటేసి కార్వాన్ ఎమ్మెల్యేగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ఈసారి ఎన్నికల్లో కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని అమర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమరసింగ్కు పలు కాలనీలలో, బస్తీలలో మహిళా ఓటర్లు హారతులిచ్చి ఘనస్వాగతం పలుకడమే కాకుండా ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జగత్సింగ్, యోగిరాజ్ సింగ్, బీజేపీ కార్వాన్ కన్వీనర్ గోవర్ధన్, సీనియర్ నాయకులు సాగర్, ముళ్లె భిక్షపతి, దొర్తుల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.