EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మతోన్మాద మజ్లిస్ కు హైదరాబాద్లో కాలం చెల్లింది         బీజేపీ విజయాన్ని ఏ రాజకీయ శక్తి ఆపలేదు  బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత ధీమా కార్వాన్ నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం- విస్తృతంగా బీజేపీ బైక్ ర్యాలీ

హైదరాబాద్ మే 11 (ఈతరం భారతం న్యూ స్);హైదరాబాద్ లో మజ్లిసకు కాలం చెల్లిందని, బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరని హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థిణి కొంపెల్ల మాధవీలత ధీమా వ్యక్తం చేశారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో చివరి రోజు శనివారం మాధవీలత స్థానిక కార్వాన్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గోవర్ధన్, గోల్కొండ జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి దిజ్వర్సింగ్, గోల్కొండ జిల్లా జాయింట్ కన్వీనర్ బి శివకుమార్యాదవ్, కట్ట నర్సింల్రావు, జియాగూడ డివిజన్ అధ్యక్షుడు జె. లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి పురానాపూల్ ధోబీఘాట్ సమీపంలోని చారిత్రాత్మక హనుమాన్ దేవాలయం నుంచి బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు బైక్ లపై తరలగా మాధవీలత ఓపెన్ టాప్ జీపుపై ఓటర్లకు అభివాదం చేస్తూ ప్రచారం కొనసాగించారు జియాగూడ బైపాస్ రోడ్డు, సంజయ్ నగర్, 2 బీహెచ్కి కాలనీ, ఎం.సి హెచ్ కాలనీ, కేశవస్వామినగర్, ఇందిరానగర్, డోర్బస్తీ, దుర్గానగర్, భీమ నగర్ చౌరస్తా జియాగూడ మెయిన్రోడ్, కుల్సుంపురా తదితర ప్రాంతాల మీదుగా మాధవీలత ఎన్నికల ప్రచార బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ రజాకార్ల వారసత్వపార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అసదుద్దీన్ ఒవైసీని ఈసారి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని విమర్శించారు. ఇందుకోసం ఓట్లు చీలకుండా ఓటర్లు సమిష్టిగా బీజేపీ పార్టీకే ఓటేసి ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు బీజేపీని గెలిపిస్తేనే హైదరాబాద్లో ముఖ్యంగా పాతబస్తీలో అభివృద్ధి, శాంతిసంక్షేమాలు విరాజిల్లుతాయన్న వాస్తవాన్ని అన్ని వర్గాల ఓటర్లు గుర్తించి కమలం గుర్తుకే ఓటేసి తనను ఎంపీగా గెలిపించాలని మాధవీలత ఓటర్లను అభ్యర్ధించారు ఈ కార్యక్రమంలో భాజపా కార్వాన్ నియోజకవర్గ కన్వీనర్ గోవర్ధన్, నగర నేతలు దిజ్వర్సింగ్, భాజపా గోల్కొండ జిల్లా జాయింట్ కన్వీనర్ బి.శివకుమార్ యాదవ్, సీనియర్ నేతలు జి. శివ్రత్నం, ఎమ్. బాలకృష్ణ, కట్ట నర్సింగ్గారావు, జియాగూడ అధ్యక్షుడు జె. లక్ష్మీనారాయణ, పార్లమెంటు కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి, ఓబీసీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉదయ్కుమార్, కార్వాన్ అధ్యక్షుడు దొర్తుల శ్రీనివాస్, గుడిమల్కాపూర్ డివిజన్ అధ్యక్షుడు సునీల్యాదవ్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top