హైదరాబాద్ డిసెంబర్21 (ఈతరం న్యూ స్); మహిళలకి ఉచిత బస్సులు పెట్టినంత మాత్రాన రాష్ట్రాలు మారిపోవు.. ఉచిత విద్య ఉచిత వైద్యం ఉద్యోగం అవి చాలు వీటిని ఉచితంగా ఇవ్వాలని బిసి సంక్షేమ సంఘ రాష్ట్ర నాయకురాలు మట్ట జయంతి గౌడ్ అన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఏ రాష్ట్రంలోనైనా కోరుకునేది ఒక్కటే ఉచితంగా ఇలాంటి పథకాలు చెందాల్సింది దివ్యాంగులకు వృద్ధులకు మాత్రమే… ఉచితంగా మహిళలకు బస్సు కేటాయిస్తే వాళ్ల సరదాలకు సంతోషాలకు వాళ్లు పాడుకుంటున్నారు దానివల్ల వచ్చే నష్టం ప్రతి ఒక్కరి మీద భారం పడుతుంది దాని విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది నోటిఫికేషన్లు వేసిన తర్వాత కూడా ఉద్యోగులు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపడతామని రాహుల్ గాంధీ గారితో పాటు రేవంత్ రెడ్డి కూడా చెప్పారు.. ఎన్నో సంవత్సరాల బీసీల ఆకాంక్ష కులగనన చేపట్టాలని… తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంశం అవసరం లేదు.. మహిళలు ధైర్యంగా తిరగాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి భద్రత కల్పించలేరు ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే అంశాన్ని తీసేయాలని బీచి మహిళా సంఘం తరపున మేము కోరుకుంటున్నామన్నారు. ఎప్పుడైతే తప్పు చేసేవాడికి భయం అనేది కలుగుతుందో అప్పటివరకు ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి…. ఈ కొత్త ప్రభుత్వం వీటన్నిటి పైన ఆలోచించి అందరి ఆకాంక్షలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి మట్ట జయంతి గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
















