EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మహిళల ఆదరణ తోనే బీ ఆర్ యస్ విజయం సాధిస్తుంది

మహిళల ఆదరణతో మళ్లీ టిఆర్ఎస్ విజయం సాధిస్తుందని అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు.నల్లకుంట డివిజన్, తిలక్ నగర్ లో జరిగిన పార్టీ ప్రచారకార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, డివిజన్ ప్రెసిడెంట్ మేడి ప్రసాద్ సమక్షంలో తిలక్ నగర్ నుండి పెద్ద ఎత్తున మహిళలు బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.సీ ఎం శ్రీ కేసీఆర్ పేదలకు, ప్రత్యేకంగా మహిళలలకు అందిస్తున్న సంక్షేమం, మరియు ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ ఆదరణ చూసి ఆకర్షితులమై తామందారం బీఆర్ఎస్ కు మద్దత్తు ఇవ్వాలని, పార్టీలో చేరినట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పేదలు, మహిళల పక్షపాతి అని, అందుకే వారి సంక్షేమం కోసం గతం లో ఎన్నడూ చూడని పధకాలు అందించి అండగా నిలిచారని, తిరిగి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక వీరికి మరింతగా మేలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top