EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మహిళా సాధికారతకు కాంగ్రెస్ పెద్దపీట ఎస్ ఎస్ ఎస్ పోస్టర్ ఆవిష్కరణలో తుంబూరు దయాకర్ రెడ్డి

29.1.2024 ఖమ్మం బ్యూరో నలు బోల మధు లత (ఈ బీ న్యూస్)

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యo ఇస్తుందని‌ మంత్రి పొంగులేటి ఖమ్మం క్యాంప్ కార్యాలయం ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు. శక్తి సూపర్ షీ (ఎస్ ఎస్ ఎస్) విభాగం జిల్లా కో ఆర్డినేటర్ గా హారిక నాయుడు ఎంపికైన సందర్భంగా.. క్యాంప్ కార్యాలయంలో ఎస్ ఎస్ ఎస్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు అండగా నిలిచేందుకు, వారి హక్కుల పరిరక్షణకు ఇది దోహదపడుతుందన్నారు. మహిళలను మరింతగా ముందుకు నడిపేందుకు ఈ సంఘం కృషి చేస్తుందన్నారు. మహిళా రక్షణ, వారికి భరోసానిచ్చేలా ట్రిబుల్ ఎస్ కార్యకలాపాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top