EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్టు తో జీహెచ్ఎంసీ, అధికారుల్లో టెన్షన్

హైదరాబాద్, జనవరి 25(EB news): హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్టు, విచారణ.. పలువురు అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. ఆయన అరెస్ట్‌ తో జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, సీడీఎంఏ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. బాలకృష్ణ ప్రలోభాలకు గురైన అధికారుల్లో గుబులు మొదలైయినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని బాలకృష్ణ అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులకు క్లియర్ చేసిన ఏఎంయూడీ అధికారులూ భయపడిపోతున్నారు.కాగా.. మార్చి నెలాఖరులో ఇద్దరు అధికారులు రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి సెలవుపై విదేశాలకు వెళ్లేందుకు ఆ ఇద్దరు అధికారులు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అయితే బాలకృష్ణ విచారణ తర్వాత మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి ఎంఏయూడీ ఉన్నత అధికారి కనుసన్నల్లోనే బాలకృష్ణ ఉన్నారని.. స్వామి కార్యం స్వకార్యం రెండూ చేసుకున్నట్లుగా గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఆ ఉన్నతాధికారి పాత్రపైనా ఏసీబీ ఆరా తీస్తున్న పరిస్థితి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సదరు అధికారిని ఎంఏయూడీ ఉన్నత పదవి నుంచి గుర్తింపులేని శాఖకు ఇటీవలే సర్కార్ బదిలీ చేసినట్లు సమాచారం.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top