EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మాయమయ్యే భాషల జాబితా లో తెలుగు: యునెస్కో అందరికి తెలుగు అందుబాటులో ఉండే విధంగా అక్షర యజ్ఞం కార్యక్రమం అక్షరయజ్ఞం నిర్వాహకులు రౌతు మధూకర్

హైదరాబాద్ ఏప్రిల్ 16 (ఈతరం భారతం న్యూ స్);అందరికి పఠనాసక్తి ,భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి ఆకురాతి గోపాలకృష్ణ వ్రాసిన తెలుగుబిడ్డ శతకం అను పద్యకావ్య పుస్తకాన్ని డా బి ఆర్ అంబేద్కర్ జయంతి లో భాగంగా అక్షరయజ్ఞం నిర్వాహకులు రౌతు మధూకర్ బల్కంపేటలో ఈ రోజు ఉచిత పంపిణి చేసారు. ఈ సందర్బంగా మధూకర్ మాట్లాడుతూ మాయమయ్యే భాషల జాబితా (లిస్ట్)లో తెలుగు కూడా ఉందనే విషయాన్ని, యునెస్కో అనే అంతర్జాతీయ సంస్థ హెచ్చరించింది.మన రోజువారీ జీవితంలో అనగా బడిలో, గుడిలో, ఏలుబడి (పాలన)లో, న్యాయస్థానాల్లో ఇలా అంతటా తెలుగేవుంటే తెలుగు భాషను కాపాడుకోగలం. అందుకే అందరికి తెలుగు అందుబాటులో ఉండే విధంగా అక్షర యజ్ఞం కార్యక్రమం ద్వారా కృషిచేస్తున్నాం పిల్లలకు పద్య /పాటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుంట సత్యనారాయణ , మంచాల దామోదర్ ,శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top