EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మార్చ్30వ నుంచి మే 31వ తేదీ దాకా ఇంట‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

హైద‌రాబాద్ మార్చ్ 28 (ఈతరం భారతం న్యూస్ ); : తెలంగాణలోని ఇంట‌ర్ కాలేజీల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఈ సెల‌వులు రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌నున్నాయి. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌కు అనుగుణంగా అడ్మిష‌న్లు తీసుకోవాల‌ని, ఆ తేదీల‌ను ప్ర‌క‌టించిన‌ప్పుడే ప్ర‌వేశాల ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని సూచించారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top