సూర్యాపేట నవంబర్ 15 (ఈతరం ఇండియా న్యూస్ );మిత్రపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే కచ్చితంగా విజయం సాధిస్తామని సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలో సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమాన్ని కోరుకునే కమ్యూనిస్టు పార్టీలు పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. ఈ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో రాష్ట్ర ప్రజల సమగ్ర సంక్షేమానికి కృషి చేయాలని సంకల్పించిన కాంగ్రెస్ పార్టీ విజయానికి కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు ఐక్యంగా కలిసి పనిచేయాలన్నారు. ఈ కాంగ్రెస్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి,డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజాద్ అలీ మున్సిపల్ ఫ్లోర్ కక్కిరేణి శ్రీనివాసు సిపిఐ పట్టణ కార్యదర్శి భూరా వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు మురగుండ్ల లక్ష్మయ్య కంభంపాటి రాము దంతాల రాంబాబు,చామల అశోక్ నిమ్మల ప్రభాకర్,పెండ్ర వెంకన్న వాడపల్లి వెంకన్న గోపగాని రవి ఏడెల్లి శ్రీకాంత్ కంభంపాటి అంతయ్య తదితరులు పాల్గొన్నారు
















