హైదరాబాద్ మార్చ్ 28 (ఈతరం భారతం న్యూ స్);వియత్నాం నుండి మీడియా నిపుణుల కోసం జర్నలిజం మరియు పబ్లిక్ రిలేషన్స్‌పై రెండు వారాల శిక్షణా కార్యక్రమం 28 మార్చి 2024 న ముగిసింది. శిక్షణార్ధులు మార్చి 29, 30 తేదీలలో ఢిల్లీ, ఆగ్రాలను సందర్శించి, మార్చి 31, 2024న వియత్నాంకు బయలుదేరుతారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ITEC ప్రోగ్రాం కింద భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసింది మరియు తెలంగాణ ప్రభుత్వంలోని డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థద్వారా నిర్వహించారు . తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ- డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశాంక్ గోయెల్, మాట్లాడుతూ, వేగవంతమైన సాంకేతిక పురోగతి మరియు అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ వ్యవస్థలతో కూడిన యుగంలో, మీడియా నిపుణులు సత్యాన్ని అనుసరించడంలో, ఖచ్చితమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో, తద్వారా ప్రజాస్వామ్య పునాదులు, మరియు ప్రపంచ అవగాహనను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న మీడియా స్థితిలో, శిక్షణ అనేది ఒక్క సారి మాత్రమే నిర్వహించే వ్యవహారం కాదని, మీడియా నిపుణులు తమ కెరీర్లో వివిధ దశలలో శిక్షణా కార్యక్రమాలకు హాజరవడం ద్వారా వారి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మరియు తాజాగా ఉంచుకోవాలని సూచించారు.భారతదేశంలో వైవిధ్యమైన మరియు క్రియాశీలక ప్రింట్ మీడియా వ్యవస్థ, లో భారీ సాంకేతిక పురోగతి సాధించిన డిజిటల్ మీడియా, ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విటర్), ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శశాంక్ గోయెల్, అన్నారు. “ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా నుండి సీనియర్ జర్నలిస్ట్‌లు, విద్యావేత్తలు మరియు విషయ నిపుణులు, వియత్నాం నుండి వచ్చిన మీడియా నిపుణులతో వారి నైపుణ్యం, దృక్కోణం మరియు ఉత్తమ అభ్యాసాలను పంచుకున్నారు” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వియత్నాంలోని మీడియా నిపుణులను తమ దేశంలోని మీడియా పరిశ్రమకు అర్ధవంతమైన సహకారం అందించడానికి సన్నద్ధం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.. మీడియా నిపుణులు తమ ప్రధాన విలువలైన నిజాయితీ, సమగ్రత మరియు జవాబుదారీతనానికి కట్టుబడి ఉండాలని మరియు సమాజంలోని వివిధ వర్గాలకు, ముఖ్యంగా బలహీనులు మరియు వెనుకబడిన వారికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. శిక్షణా కార్యక్రమం కేవలం తరగతి గదికే పరిమితం కాలేదు. “మేము హైదరాబాద్, వరంగల్, నాగార్జునసాగర్ , జహీరాబాద్ మొదలైన ప్రాంతాలలో అనేక క్షేత్ర సందర్శనలను ఏర్పాటు చేసాము, మీడియా నిపుణులు జర్నలిజం మరియు మీడియా సంబంధాలకు సంబంధించిన సమస్యలను అలాగే భారతదేశం -ముఖ్యంగా తెలంగాణయొక్క మిశ్రమ సంస్కృతి మరియు వారసత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పించాము.’’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం భారత్, వియత్నాం మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.వియత్నాంమీడియా నిపుణులు సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించారు మరియు ‘సామీ సామి’ మరియు ‘నాటు నాటు’ అనే రెండు జనాకర్షక పాటల మనోహరమైన సంగీతానికి నృత్యం చేశి హాజరైన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ఒక వియత్నామీస్ పాట ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని పంచి, నృత్యం చేసేట్లు చేసింది.ఈ సందర్భంగా డాక్టర్ శశాంక్ గోయెల్, ఐఏఎస్కోర్సు పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. డాక్టర్ మాధవి రావులపాటి, కోర్స్ డైరెక్టర్ & హెడ్ (CLP)సభకు స్వాగతం పలికి, వీడుకోలు సమావేశాన్ని నిర్వహించారు
.















