EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ముగిసిన ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం..   భారీగా తరలివచ్చిన భక్తులు

హైదరాబాద్‌ సెప్టెంబర్ 17 (ఈతరం భారతం);: ఖైరతాబాద్‌ గణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్‌ బాద్‌ నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్‌ భవన్‌, సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ చేరుకున్నాడు. అనంతరం వెల్డింగ్‌ పనులు పూర్తయిన తర్వాత.. మహాగణపతికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద లంబోధరుడిని నిమజ్జనం చేశారు. మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్‌ జనసంద్రంగా మారిపోయింది. గతపతి బప్పా మోరియా నినాదాలతో హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు మారుమ్రోగాయి.భాగ్యనగరమే కాదు దేశవ్యాప్తంగా ఖైరతాబాద్‌ గణేషుడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఉత్సవాలను ప్రారంభించి 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి రికార్డు స్థాయిలో 70 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. శిల్పి చిన్న స్వామి రాజేందర్‌ ఆధ్వర్యంలో లంబోధరుడుని రూపొందించారు. 200 మంది కార్మికులు ఒకటిన్నర రోజులు శ్రమించి గణేషుడిని అలంకరించారు. 11 రోజులపాటు మహాగణపతిని లక్షలాది మంది భక్తులు, సందర్శకులు దర్శించుకున్నారు. ఈసారి రూ.కోటి 10 లక్షల ఆదాయం సమకూరిందని నిర్వాహకులు వెల్లడించారు. హుండీ ద్వారా రూ.70 లక్షలు రాగా, ప్రకటనలు, హోర్డింగుల ద్వారా మరో రూ.40 లక్షలు సమకూరాయి.కాగా, గణేష్‌ నిమజ్జనంలో పాల్గొన్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి నిలిచారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి.. అటు నుంచి నేరుగా ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్‌ నంబర్‌ 4 వద్ద పరిశీలన జరిపారు. అక్కడి నుంచే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారు

.

 

Related News

Select the Topic
Scroll to Top