EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మూడుపువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్న అక్రమ రేషన్ బియ్యం దందా

మూడుపువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్న అక్రమ రేషన్ బియ్యం దందా

13.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

చేవెళ్ల డివిజన్లో అక్రమ రేషన్ బియ్యం దందా జోరుగా కొనసాగుతోoది. ఆరోగ్య శ్రీ, ఇతర ప్రభుత్వ పథకాలు వస్తాయని అనర్హులైన వారు కూడా తెల్లరేషన్ కార్డులు తీసుకున్నారు. తెల్ల తెల్లరేషన్ కార్డుదారులందరికి ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నది. ఈ బియ్యాన్ని పేదలు సద్వినియోగం చేసుకుంటుండగా, ఆర్థికంగా ఉన్నవారు మాత్రం దుర్వినియోగం చేస్తున్నారు .డబ్బులకు కక్కుర్తిపడి తీసుకున్న బియ్యాన్ని రేషన్ ముఠాలకు అప్పగిస్తున్నారు.రేషన్ మాఫియా ముఠాలు కొంతమందిని జీతాలకు నియమించుకుని ఇంటింటికి వెళ్లి రేషన్ బియ్యంను కేజీకి రూ.10ల చొప్పున లబ్దిదారుల నుంచి సేకరిస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు.. రీ-సైక్లింగ్, పాలీషింగ్ చేసి అధిక ధరలకు కేజీ రూ.30 నుంచి 35 వరకు విక్రయిస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top