EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల చొప్పున చెక్కుల పంపిణీ అందజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల చొప్పున చెక్కుల పంపిణీ

అందజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

04.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

కూసుమంచి : భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి బుధవారం అందజేశారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో వరదల్లో మృతిచెందిన షేక్ యాకుబ్, సైదాబీ దంపతుల కుటుంబాన్ని పరామర్శించి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను వారి కుమారులు ఎస్. కె. యూసుబ్, ఎస్. కె. షరీఫ్ లకు అందజేశారు. మృతుల కుటుంబం కోరిక మేరకు కూసుమంచిలో ఇంటి స్థలం కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, కూసుమంచి మండల తహసీల్దార్ సురేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top