EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మేడారం మహాజాతరకు జాతరకు 6వేల బస్సులు  ఆర్టీసీ ఎండీ సజ్జనార్

వరంగల్ ఫిబ్రవరి 18 (ఈ బీ న్యూస్ );: మేడారం మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మేడారం మహాజాతరపై ఆర్టీసీ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో సజ్జనార్ మాట్లాడుతూ… జాతరకు 6వేల బస్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. 15వేల మంది సిబ్బంది జాతర విధుల్లో ఉంటారని చెప్పారు. తెలంగాణలోని 51 పాయింట్ల నుంచి బస్సులు నడిపిస్తున్నట్లు వివరించారు. జాతర బస్సుల్లో కోళ్లు, మేకలకు అనుమతి లేదన్నారు. ఈ సారి జాతరకు రెండువేల బస్సులను అదనంగా నడుపుతున్నట్లు చెప్పారు. జాతర బస్సులకు నార్మల్ ఛార్జీలే తీసుకుంటామని సజ్జనార్ పేర్కొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top