హైదరాబాద్/విజయవాడ/రంగారెడ్డి మే 1 (ఈతరం భారతం న్యూస్ ):మే డే పురస్కరించుకొని హెల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్ పర్సన్ డాక్టర్ కాకుమాను జ్యోతి ఆద్వర్యం లో లో సికింద్రాబాద్ లోని ఖర్ఖన లో మానసిక వికలాంగుల పిల్లలకు ఆహారం, అలాగే విజయవాడలోని కొండ పల్లి లో పేదలకు బట్టల పంపిణీ, రంగా రెడ్డి జిల్లా ఉప్పర్ పల్లి లో పేదపిల్లలకు పిల్లలకు ఆహారం అందించడం జరిగిందని కాకుమాను జ్యోతి తెలిపారు.ఈ కార్యక్రమం లో అవ్వారు సంగీత వితరణ తో పాటు అన్ని ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందరు పాల్గొన్నారు.















