యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఉచిత మెడికల్ క్యాంప్….దుప్పట్ల పంపిణీ…..అన్నదానం
13.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
తిరుమలాయపాలెం : రాకాసి తండా వరద బాధితులకు యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఉచిత మెడికల్ క్యాంప్….దుప్పట్ల పంపిణీ…..అన్నదానం
ఖమ్మం కార్పొరేటర్ బిజీ క్లైమేంట్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాకాసి తండా గ్రామం పూర్తిగా వరద ఉధృతిలో సర్వం కోల్పోయి నిరాశ్యులైన గ్రామస్తులకు ఖమ్మం వై ఎం సి ఎ (యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెడికల్ క్యాంప్, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు., క్రిస్టియన్ సర్వీస్ యూనిట్ అద్యక్షులు ఫ్రాంక్లిన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్ లో డాక్టర్ చందన రోగులను పరీక్షించారు. బిపి,షుగర్ వంటి పరీక్షలను నిర్ధారించి, వారికి మందుల పంపిణీ చేశారు.సిస్టర్ పల్లవి, ప్రసాద్ రోగులకు మందులు పంపిణీ చేశారు. అనంతరం వరద ఉధృతిలో నిరాశ్రయులై కట్టుబట్టలతో మిగిలిన బాధితులకుమధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రెసిడెంట్ బి జి క్లెమెంట్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాకాసి తండా గ్రామ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలుసుకొని 78 కుటుంబాలకు దుప్పట్లు, టవల్స్ పంపిణి చేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. రాకాసి తండా ప్రజలు ధైర్యంగా ఉండాలని వారిని ఆదుకోవడానికి వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వై ఎం సి ఎ , వైస్ ప్రెసిడెంట్ శేఖర్ బాబు కార్యదర్శి జడ్ టి సుదకర్ సభ్యులు కె సంజీవరావు, గీతా కమలాకర్, మేరి షేకర్ బాబు, శిల్పా జాన్సన్, పల్లా కిషోర్, పీ అజయ్, నవీన్, రుత్విక్, యూనిట్ ఆఫ్ మాల మండల అధ్యక్షులు గుజ్జ రామకృష్ణ గాదరి బాబు తదితరుల పాల్గొన్నారు.















