యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 22 (ఈతరం ఇండియా న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణాలు, గ్రామాలలోని పలు దేవాలయాలు, వీధుల కూడళ్లలో బతుకమ్మలను పెట్టి గౌరీ పూజలు జరిపిన అనంతరం ఉయ్యాల పాటలు పాడుతూ ఆటలు ఆడారు. సంప్రదాయరీతిలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించిన అనంతరం నీటిలో నిమజ్జనం జరిపి వాయనాలను ఇచ్చి పుచ్చుకున్నారు. బతుకమ్మ వేడుకలు చూసేందుకు గ్రామాలు, పట్టణాలలో మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుక ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది.



















