ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ప్రతినిధి మే 13 2024 : యాదాద్రి భువనగిరి జిల్లా లో సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఓటర్ల ఉత్సాహం మధ్య ఊపందుకుంది. ఉదయం 7 గంటల నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మహిళలు, యువకులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఓటువేశారు.పొలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.















