యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు …
ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
పి. ఆర్ నం . 371
తాడ్ల పూసపల్లి – మహబూబాబాద్ సెక్షన్ లో డబుల్-లైన్ ట్రాక్ &
ఇంటికన్నె – కేసముద్రం సెక్షన్ లో సింగిల్ లైన్ ట్రాక్ పునరుద్ధరణ పూర్తి. ఇంటికన్నె- కేసముద్రం సెక్షన్‌లోని మరో లైన్ పునరుద్ధరణ పనులు తుది దశలో ఉన్నవి మరియు రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉంది. రైలు కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.ట్రాక్ పునరుద్ధరించబడిన తరువాత గోల్కొండ ఎక్స్‌ప్రెస్ 14.30 గంటలకు ట్రాక్‌లను దాటిన మొదటి ప్యాసింజర్ రైలు. ట్రాక్‌లను పునరుద్ధరించడానికి 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి, 5,000 క్యూబిక్ మీటర్ల బ్యాలస్ట్ మరియు 6,000 క్యూబిక్ మీటర్ల కన్సాలిడేషన్ ప్రత్యేక మట్టిని ఉపయోగిస్తారు.
భారీ వర్షాలు మరియు ఎగువ ప్రవాహంలోని ట్యాంకుల నుండి వరద నీరు భారీగా విడుదలవడంతో, ఇంటికన్నె- కేసముద్రం మరియు తాడ్ల పూసపల్లి- మహబూబాబాద్ మధ్య సెక్షన్‌లో15 ప్రాంతాలలో రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయి. తాడ్ల పూసపల్లి- మహబూబాబాద్ సెక్షన్ మధ్య 8 చోట్ల మరియు ఇంటికన్నె- కేసముద్రం సెక్షన్ మధ్య 7 ప్రదేశాలలో ట్రాక్ లు దెబ్బతిన్నాయి. ఈ ట్రాక్‌ల పునరుద్ధరణ కోసం మొత్తం 30000 క్యూ మీ మట్టి, 5000 క్యూ మీ బ్యాలస్ట్ మరియు 6000 క్యూ మీ కన్సాలిడేషన్ ప్రత్యేక మట్టిని ఉపయోగించారు. ఇంటికన్నె- కేసముద్రం మరియు తాడ్ల పూసపల్లి- మహబూబాబాద్ మధ్య ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, ట్రాక్‌ను త్వరగా పునరుద్ధరించేందుకు 24×7 నిరంతరంగా పనులు చేపట్టారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రయాణికులు సహకరించడం పట్ల ప్రశంసించారు. పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన అధికారులు మరియు సిబ్బంది బృందాన్ని, ట్రాక్‌ను త్వరగా పునరుద్ధరించడంలో వారి నిరంతర నిబద్ధత మరియు అంకితభావానికి కూడా ఆయన ప్రశంసించారు. అర్ధరాత్రి సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా మరియు సత్వర చర్యలు తీసుకున్నందుకు రాత్రి పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ట్రాక్-మెన్‌లతో సహా భద్రతా సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు. సిబ్బంది అప్రమత్తత కారణంగా అన్ని రైళ్లను వివిధ స్టేషన్లలో క్రమబద్ధీకరించినట్లు ఆయన తెలిపారు.ఇంటికన్నె- కేసముద్రం సెక్షన్ మధ్య ట్రాక్ పునరుద్ధరణ పనులు 7 ప్రదేశాలలో అప్ మరియు డౌన్ ట్రాక్‌ల కోసం జరిగాయి. ఒక వర్షాకాలం ప్రత్యేక రైలు (బండరాళ్లు మరియు ఇసుక సంచులతో), 15-హిటాచీలు, 4-జె.సి.బి లు, 8-ట్రాక్టర్లు, 10-టిప్పర్లు, 1- యుటిలిటీ ట్రాక్ వెహికల్, 1- మల్టీ పర్పస్ ట్యాంపింగ్ మెషిన్, 1-డ్యూమాటిక్ ట్యాంపింగ్ మెషిన్, 1-బ్యాలస్ట్ రేక్ & దాదాపు 400 మంది నైపుణ్యం కలిగిన 400 మంది కార్మికులు పునరుద్ధరణ పనులను పూర్తి చేసేందుకు పాల్గొన్నారు. దీనికి సంబంధించి, సెక్షన్‌లోని అప్‌లైన్‌లో పునరుద్ధరణ పనులు ఈరోజు ఉదయం 9.00 గంటలకు విజయవంతంగా పూర్తయ్యాయి. దీని ప్రకారం, సంగమిత్ర ఎక్స్‌ప్రెస్ ఖాళీ రైలు ఇంటికన్నె- కేసముద్రం సెక్షన్‌లోని అప్-లైన్‌లో నడపబడింది మరియు ట్రాక్ రైలు రాకపోకలకు అనుగుణంగా ఉందని ప్రకటించబడింది. సెక్షన్‌లోని డౌన్‌లైన్‌లో పునరుద్ధరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి మరియు ఈ రాత్రికి రైల్వే ట్రాక్‌ను ఫిట్‌గా ప్రకటించాలని భావిస్తున్నారు.సికింద్రాబాద్ డివిజన్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ భరతేష్ కుమార్ జైన్; చీఫ్ ఇంజనీర్/ట్రాక్ మెయింటెనెన్స్ శ్రీ బి. కృష్ణా రెడ్డి; సికింద్రాబాద్ డివిజన్‌లోని అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్/ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, శ్రీ గోపాల్ ; సికింద్రాబాద్లోని చీఫ్ ప్రాజెక్ట్స్ మేనేజర్ గతి –శక్తి మరియు ఇతర సీనియర్ డివిజనల్ అధికారులు ఇంటికన్నె వద్ద క్యాంప్ చేసి పునరుద్ధరణ ప్రక్రియను పర్యవేక్షించారు. అదే సమయంలో తాడ్ల పూసపల్లి –మహబూబాబాద్ సెక్షన్ అప్ అండ్ డౌన్ లైన్లలోని నష్టం వాటిల్లిన మొత్తం ఎనిమిది స్థానాల్లో సాయంత్రం విజయవంతంగా పునరుద్ధరించబడినాయి. రైలు నం.12296 ఎస్.ఏం.వి.టి బెంగళూరు-దానాపూర్ సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ ఖాళీ రేక్ ను కేసముద్రం నుండి మహబూబాబాద్ వరకు పునరుద్ధరించబడిన ట్రాక్ భాగంపై నడిపారు మరియు రైలు రాకపోకలకు ఈ లైన్ సరిపోతుందని ప్రకటించబడింది. ఒక వర్షాకాలం ప్రత్యేక రైలు (బండలు & ఇసుక సంచులు), 12-హిటాచీలు, 6- జె.సి.బి లు, 10-ట్రాక్టర్లు, 20-టిప్పర్లు, 1- యుటిలిటీ ట్రాక్ వెహికల్, 1-డ్యూమాటిక్ ట్యాంపింగ్ మెషిన్, 1-డైనమిక్ స్టెబిలైజేషన్ మెషిన్, 1- మల్టి పర్పోజ్ ట్యాంపింగ్ మెషిన్ మరియు దాదాపు 350 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు పునరుద్ధరణ పనులను పూర్తి చేయడానికి ఈ విభాగంలో పాల్గొన్నారు.చీఫ్ జనరల్ ఇంజనీర్ శ్రీ ఎస్. కె శర్మ; సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ ; డిప్యూటీ చీఫ్ ఇంజనీర్/నిర్మాణం; సికింద్రాబాద్‌లోని గతి -శక్తి యూనిట్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మరియుఇతర ఉన్నతాధికారులు తాడ్ల పూసపల్లి వద్ద సంఘటనా స్థలంలో మకాం వేసి పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు.















