రంగారెడ్డి ఫిబ్రవరి 2 (ఈ బీ న్యూ స్);రాజకీయ అంతరాల దొంతరలో బీసీలు ఆగమవుతున్నారని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణకేంద్రంలోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు రాములు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య నాయకుల సమావేశంలోఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 75సంవత్సరాల గణతంత్ర దేశం లో అగ్రకుల నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం బీసీలను రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేసి, హక్కులను కాలరాసి,ఓట్లు వేసే యంత్రాలుగా, సంపద సృష్టించే మరమనుసులుగా చూస్తూ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో సామాజిక న్యాయ స్ఫూర్తిగా విరుద్ధంగా బీసీలకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం. రాజకీయ అణిచివేతకు గురైన బీసీలు ఇకనైనా ఏకతాటి పైకి వచ్చి పోరాడితేనే పాలనలో భాగస్వాములు అవుతాం లేకుంటే భావితరాలకు బానిసత్వాన్ని వారసత్వంగా ఇచ్చిన వారం అవుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలలో ఒక స్థానం బీసీకి కేటాయించాలని, వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థిగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు. బీసీలను విస్మరించిన రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడానికి బీసీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరాటే కుతినే చెన్నయ్య, నియోజకవర్గం అధ్యక్షులు, రాములు గౌడ్, ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు శ్రీనివాసులుమాజీ సర్పంచ్ శ్రీనివాస్,గొడుగు నరసింహులు, శ్రీశైలం యాదవ్,గణేష్, శ్రీకాంత్, చంద్ర కాంత్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.















