EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాజకీయ వ్యభిచారం చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ల నాయకులు

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి మార్చ్ 30,2024 :

గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్న విచారణ అనేక మలుపులు తిరగుతుంది. ఈ విచారణలో అనేక విషయాలు బయటికి వస్తున్నాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయనో,అసలు ఫోన్ ట్యాపింగ్ లను పోలీసులు వాళ్లకు వాళ్లే చేశారా, అప్పటి డీజీపీ చెప్తే చేశారా, హోంమంత్రి చెప్తే చేశారా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తే చేశారా లేదా కేటీఆర్ చెప్తే చేశారా అనేది తెలియాల్సిన అవసరం ఉందన్నారు.ఇప్పుడే ఫోన్ ట్యాపింగ్ అంశం ఎందుకు తెరమీదకి వస్తుంది.ఇటీవల కేటీఆర్ ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏం తప్పని అంటున్నారు.కచ్చితంగా కేటీఆర్ గారిని మొట్టమొదటగా విచారణ చేయాలి.ఇంత పెద్ద వ్యవహారంలో అప్పటి డీజీపీ కి ఏం తెలియకుండా జరిగిందా..??అప్పటి డీజీపీని విచారించడానికి ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు.అప్పటి హోంమంత్రికి తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ లు జరిగియా..? హెంమంత్రిని విచారణ చేయాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది.రాజకీయ కార్యకలాపాలు తెలుసుకోవడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లయితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర కనుసన్నల్లోనే జరిగినట్లు మేం పేర్కొంటున్నాం.కేసీఆర్, కేటీఆర్, అప్పటి డీజీపీ, హోంమంత్రుల మీద విచారణ జరిపాలని ప్రభాకర్ డిమాండ్ చేసారు..కాళేశ్వరం ప్రాజెక్టు కుంగి కాళీ చేసే పరిస్థితికి వచ్చింది.కాళేశ్వరం విషయాన్ని కూడా అధికారుల పైనే తోసేస్తున్నారు.కాళేశ్వరంలో ప్రాజెక్టులో డ్యాం సేఫ్టీ ఆథారటీ వాళ్లు విచారణ చేస్తున్నారు.ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ఇరిగేషన్ మంత్రి హారీష్ రావుకు విచారణ కోసం ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలి.ఉచిత బర్రెలు, గొర్రెల విషయంలో కూడా అవినీతి జరిగిందని కథనాలు వచ్చాయి.అప్పటి పశుసంవర్థ శాఖ మంత్రికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు.? ఈ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గత ప్రభుత్వ మంత్రులను విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.100రోజుల పాలన మీద రేవంత్ రెడ్డి రెఫరెండం గురించి మాట్లాడుతున్నారు. అసలు 100 రోజుల్లో ఏ పథకం పూర్తిస్థాయిలో అమలు చేశారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.పార్టీ ఫిరాయింపుల అంశం మీద రేవంత్ రెడ్డి గారు రెఫరెండానికి సిధ్దంగా ఉన్నారా..?ప్రభుత్వ అసమర్థత బయడపడి, జాతీయ అంశాలు తెరమీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పని ఖతం అయితదనే రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నారు.100 రోజుల్లో 100మోసాలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ గారే పంపుతున్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద విచారణ జరపకుండా కేసీఆర్, కేటీఆర్ ను కాపాడేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరుతున్నట్టుగా స్పస్తామవుతున్దన్నారు..బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఒకరినొకరు కాపాడుకునేందుకే రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు.బీఆర్ఎస్ లో భవిష్యత్తు లేక, కుటుంబ పార్టీగా మారిందని భావించి, మరొకసారి కేంద్రంలో నరేంద్రమోదీ మూడవసారి ప్రధానమంత్రి కావడం ఖాయం అని తెలిసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు.కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న కార్యక్రమంలో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు.గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కాపాడేందుకే అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవినీతి జరిగిందని చెప్పిన కేసీఆర్ గారు అప్పటి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి పైన ఎలాంటి చర్య తీసుకోలేదు.సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య అవగాహన ఒప్పందం ఉంది.నిజంగా సీఎం రేవంత్ రెడ్డి కి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ అంశం పైన మూడు రోజుల్లో కేసీఆర్, కేసీఆర్, అప్పటి హోంమంత్రి, డీజీపీలను విచారిస్తే అసలైన బాగోతం బయటపడ్తది.బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో కలిసి నడవాలనే ఆలోచనతోనే జరుగుతున్న వ్యవహారంలోనే ఫోన్ ట్యాపింగ్ కథ నడుస్తోంది.

 

Related News

Select the Topic
Scroll to Top