రంగా రెడ్డి ఏప్రిల్ 17 (ఈతరం భారతం న్యూస్ ); రాజేంద్రనగర్ హరిహర క్షేత్రంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అనంతగిరి అనంత చారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కనులు పండగ జరిగింది. ఈ సందర్బంగా దేవాలయ ప్రాంగణం రామనామంతో మారుమోగింది.అనంతరం భక్తులు వడపప్పు, పానకం అన్న ప్రసాదం మహా నైవేద్యం స్వీకరించడం జరిగింది.
.















