హైదరాబాద్ మే 6 (ఈతరం భారతం న్యూ స్);బీసీ రాజ్యాధికార సమితి ఆద్వర్యం లో రాజ్యాంగ రక్షణ – రిజర్వేషన్ల పరిరక్షణ” అనే అంశంపై ఈ నెల 7 న అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అద్యక్షులు దాసు సురేష్ తెలిపారు బేగంపేట, ఫూలే ప్రజాభవన్ పక్కన తెలంగాణ టూరిజం ప్లాజా ప్రాణహిత హాల్ లో ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి రాజ్యాంగ నిపుణులు. అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఉద్యమకారులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొననున్నారు.. ఈ సమావేశంలో అస్తవ్యస్త కొనసాగుతున్న ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థ వలన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న నష్టాన్ని సంఖ్యాపరంగా వివరించనున్నట్లు తెలిపారు.ముఖ్య అతిధులుగా కొండా సురేఖ – తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ -తెలంగాణ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు వన్నాల శ్రీ రాములు – మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాపోలు ఆనందభాస్కర్ మాజీ పార్లమెంటు సభ్యులు జస్టిస్ చంద్ర కుమార్ రాజ్యాంగ నిపుణులు ప్రొ. కోదండరామ్ – టీజేయెస్ అధ్యక్షులు ప్రొఫెసర్ హరగోపాల్ – సామాజికవేత్త పాశం యాదగిరి – ప్రముఖ జర్నలిస్టు తెలంగాణ విఠల్ – ప్రముఖ జర్నలిస్టు హాజరవుతున్నట్లు దాసు సురేష్ తెలిపారు
.















