EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాజ్యాధికారం సామాన్యుడికి ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది

హైదరాబాద్ జనవరి 26 (ఈ బీ న్యూస్);భారత గణతంత్ర దినోత్సవం 26 జనవరి ను పురస్కరించుకొని ‘రాజ్యాంగ పితామహుడు’ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్కు ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకులు భారత సుదర్శన్ పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా భారత సుదర్శన్ మాట్లాడుతూ.. నేడు మన భారత దేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. 75ఏండ్లలో భారతీయులు ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని ప్రపంచంలో తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. ప్రపంచ భవిష్యత్ అంతా భారత్ చుట్టే తిరుగుతుందన్న ఆశాభావాన్ని సుదర్శన్ వ్యక్తం చేశారు. రాజ్యాధికారం సామాన్యుడికి ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని, దేశంలో డబ్బు రాజకీయాలు పోవాలని, దానికై ప్రతి భారతీయుడు పోరాడాలని భారత సుదర్శన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజామిత్ర సంస్థ కో ఆర్డినేటర్ పుల్లూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top