రాష్ట్రంలో ఇందిరా కాంగ్రెస్, వర్సస్ ఆర్ ఆర్ కాంగ్రెస్
రాష్ట్రంలో ఉన్న అర్ అర్ కాంగ్రెస్ కు ఏఐసీసీ కి గ్యాప్ ఉంది
పీఏసీ చైర్మన్ విషయంలో సంప్రదాయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేసింది
ఇతర పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నాం
సీనియర్ నాయకులు విభేదిస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు
పార్టీ మారిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి
హైడ్రా ఆరంభ శూరత్వమని ముందే చెప్పాము
బీజేపీశాసనసభాపక్షనేతఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ సెప్టెంబర్ 10 (ఈతరం భారతం);రాష్ట్రంలో ఇందిరా కాంగ్రెస్, వర్సస్ ఆర్ ఆర్ కాంగ్రెస్ పాలన సాగుతుందని ఏఐసీసీ నిర్ణయానికి విరుద్ధంగా ఆర్.ఆర్ కాంగ్రెస్ నడుచుకుంటున్నట్లుగా అనిపిస్తున్నదని బీజేపీశాసనసభాపక్షనేతఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారంబీజేపీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లడుతూపార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హత వేటు వేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మరి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?ఇందిరా కాంగ్రెస్ నిర్ణయాలు ఇక్కడున్న అర్ అర్ కాంగ్రెస్ అమలు చేయదా! అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఇందిరా కాంగ్రెస్ వర్సెస్ ఆర్.ఆర్ కాంగ్రెస్ అనేలా ఉందన్నారు.రాష్ట్రంలో ఉన్న అర్ అర్ కాంగ్రెస్ కు ఏఐసీసీ కి గ్యాప్ ఉంది.పీఏసీ చైర్మన్ విషయంలో సంప్రదాయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేసిందన్నారు.కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ రేవంత్ ప్రభుత్వం మరో తప్పిదానికి పాల్పడింది. ఇతర పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పార్టీ మారిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారూ.పద్దుల కమిటీ.. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా గురించి, తప్పుడు లెక్కల గురించి ప్రశ్నించే పీఏసీ కమిటీ.ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి ఇవ్వడం జరుగుతుంది. కాని ఆ ఆనవాయితీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు..బీఆర్ఎస్ ముగ్గురు పేర్లు పంపినప్పటికీ..తమ ఇష్టానుసారంగా చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు..సీనియర్ నాయకులు విభేదిస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. అందుకే పార్టీలో ఎమ్మెల్యేల చేరికల సమయంలో ఎక్కడా సీనియర్ నాయకులు కనిపించడం లేదు. ప్రజలకిచ్చిన హామీలను వదిలేసి, వరద బాధితులకు సాయం వదిలేసి, కలెన్షన్ల బిజీలో కాంగ్రెస్ నేతలుఆర్ ట్యాక్స్, ఆర్ ఆర్ ట్యాక్స్ , ఆర్ ఆర్ ఆర్ ట్యాక్స్ , బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ ఇలా కలెక్షన్లలోమునిగితేలుతున్నారు. రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా, రైతుబంధు ఇవ్వకుండా కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యారు.ఇప్పటికైనా కోర్టు తీర్పునకు అనుగుణంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేసారు.
హైడ్రా ఆరంభ శూరత్వమని ముందే చెప్పాము. కావాలనే హైడ్రా కోరలను ముఖ్యమంత్రి పీకేశారు. కుటుంబ ఫ్రెషర్స్ , ఓవైసీ కి భయపడే హైడ్రా పై సీఎం వెనక్కి తగ్గారు.హైడ్రా వెనక వందల కోట్లు చేతులు మారుతున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్ ఏ పని చేసినా దాని వెనుక వసూల్స్ ఉంటాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి దిన దిన గండంగా మారిన సీఎం పదవిపీసీసీ అధ్యక్ష పదవి సీఎం రేవంత్ చెప్పిన వ్యక్తికి రాలేదు హై కోర్టు తీర్పుపై మంత్రి పొన్నం వ్యాఖ్యలే నిదర్శనం.మంత్రుల కు ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ ఉందన్న విషయం బయటపడిందన్నారు.
హైకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు.ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. హైకోర్టు తీర్పును మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించడం మంచి పరిణామమన్నారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి తీసుకెళ్లి తీర్పును గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టు ఇచ్చిన తీర్పును, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని.,గతంలో బీఆర్ఎస్…. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పాల్పడినప్పుడు, దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినవిషయాన్ని ఈ సందర్బంగా మహేశ్వర్ రెడ్డి గుర్తు చేసారు.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారి ఇళ్ల ముందు చావు డప్పు కొట్టమన్నారు.ఆయనే ఇప్పుడు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో అనైతికంగా చేర్చుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం..? అని ప్రశ్నించారు.















