EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని బిసి వర్గానికి చెందిన జర్నలిస్ట్ లకు ఇవ్వాలి

హైదరాబాద్ జనవరి 31 (ఈ బీ న్యూస్)  ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని బిసి సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్ట్ లకు ఇవ్వాలని జనహిత జర్నలిస్ట్ యూనియాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జనహిత జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు గోర శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీధర్ కృష్ణ యాదవ్, ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్ట్ దుగ్గిరాల గాంధీ లు విడుదలచేసిన పత్రికా ప్రకటనలో వారు కోరారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టులకు ఎవరికైనా ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని కోరారు. జర్నలిజం వృత్తిలో బీసీ కులాలకు చెందిన జర్నలిస్టులే అధికంగా కొనసాగుతున్నారన్నారు. కొంతమంది బీసీ జర్నలిస్టులు చిన్న పత్రికలను నిర్వహిస్తూ ఎన్నో సాధక బాధకాలను ఎదుర్కొంటున్నారని, వారందరి సమస్యల పరిష్కారానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బీసీ జర్నలిస్టును నియమిస్తే ఆయన సానుకూలంగా స్పందించడమే కాకుండా వారి సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top