అమరావతి సెప్టెంబర్ 18 (ఈతరం భారతం); : రెండు తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్ లను కేటాయిస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు హరియాణాకు చెందిన దీక్ష, తమిళనాడుకు చెందిన సుష్మిత, ఏపీకి చెందిన బొడ్డు హేమంత్ , మనీషా వంగల రెడ్డిలను కేటాయించింది.తెలంగాణ కు జమ్మూకశ్మీర్‌కు చెందిన మనన్ భట్ , తెలంగాణకు చెందిన రుత్విక్ సాయి కొట్టే, సాయి కిరణ్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యాదవ్ వసుంధరను కేటాయించారు.















