జోగులాంబ గద్వాల (ఈ బీ న్యూ స్);తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా మారుతున్నాయని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తట్టే మహేష్ పేర్కొన్నారు.ఒకప్పుడు చేనేత కళాకారులుగా పేరుపొందిన నేతన్నలు ప్రస్తుతం చేనేత కార్మికులుగా పిలవబడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని గడ్డు పరిస్థితులలో అనుభవిస్తున్న చేనేత కళాకారులు ..,,,రాట్నం. తిరగదు ..,,,కడుపు నిండదు,,, అంటూ జీవిస్తున్న నేతన్నలు చాలీచాలని కూలీలతో పూట గడవడమే కష్టంగా మారిందని పేర్కొన్నారు. మారుతున్న జీవితాలు, చేనేత సన్నగిల్లి కడు దీనావస్థలో సంసార జీవితాలు నెట్టుకొస్తున్న నేతన్న కుటుంబాలు. జోగులాంబ గద్వాల జిల్లాలో జియో ట్యాగ్ కలిగిన రిజిస్టర్ పొందిన 3200. మగ్గాలు ఉన్నాయని, ఇందులో మగ్గం నేసేవారు ,సహాయ కార్మికులుగా అంచు పట్టేవారు, కండెలు చుట్టేవారు, ప్రతి జియో టాకు ముగ్గురు పనిచేస్తేనే ఒక మగ్గం నడుస్తుంది. దాదాపు చేనేత మగ్గాలు నేస్తూ జీవనం గడుపుతున్న 12వేల కుటుంబాలు జిల్లాలో నివసిస్తున్నారన్నారు. దాదాపు చేనేత కార్మికుల సంఖ్య 30 వేల వరకు ఉన్నారని అంచనా. ఇందులో 90 శాతం చేనేత కార్మికులు చాలీచాలని కూలీలతో జీవిస్తున్నారని, కార్మికులు వాపోతున్నారు. మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కళాకారులకు కార్మికులకు అండగా ఉండి వారి కష్టాలను తీరుస్తారని, వ్యవసాయ రంగం తర్వాత రెండవ స్థానంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకుంటారని, గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగిస్తూ, మరిన్ని సంక్షేమ పథకాలు చేనేత కార్మికుల కొరకు ప్రవేశపెట్టి ఆదుకోవాలని చేనేత కళాకారులుగా నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండాలంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత, జౌలి శాఖకు మరిన్ని నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ సంక్షేమ పథకాలు మంజూరు చేసి వాటిని అమలుపరిచి చేనేత కళాకారులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తట్టే మహేష్ విజ్ఞప్తి చేసారు.















