హైదరాబాద్ (ఈతరం భారతం న్యూస్);కుర్ని (నేసే ) నాలుగు లక్షల 50 వేల జనాభా ఉన్నటువంటి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ డిమాండ్ చేసారు. ఖైరతాబాద్ లోని తెలంగాణ కుర్ని (నేసే) వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో కుర్ని రాష్ట్ర కుల అధ్యక్షులు పీజికే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కుర్ని (నేసే) ఆత్మీయ సమ్మేళనం జరిగింది.ఈ కార్యక్రమం లో పాల్గొన్న తట్టే మహేష్ మాట్లాడుతూకార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే చేనేత కుటుంబాలు బాగుపడతాయి అని అన్నారు.అందరి గౌరవాన్ని కాపాడే చేనేత వస్త్రం ఎంత విలువైనదో మనం రోజు ధరించే దుస్తులు కనపడుతుంది అలాంటి బట్టలు తయారు చేసే నేతన్నకు ఎందుకు గౌరవం ఇవ్వడం లేదు ఇ ప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి చేనేత కుటుంబాలకు 45 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలా అలాగే చేనేత భీమా కూడా5,00,000 ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.పాల్గొన్న వారిలో డాన్ వీరన్న, డాక్టర్ పి జి కే వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్ ఆంజనేయులు రియల్ ఎస్టేట్ గడిగే సిద్ధి రామప్ప, కేకే యాల్ల ప్ప మై లే రమేష్ వైన్ డింగ్నా నా గరాజ్ కనికే చిట్టి ఆంజనేయులు, కౌన్సిలర్ సరళ పావని వెంకటేష్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు కాకి ఎల్లప్ప మైలే రమేష్ మైలే నాగరాజ్ మాచర్ల సర్పంచ్ పీజీ సిద్ధి రామప్ప, మాదుగుండు కామేష్, కనికే రానా , కాకే జగన్నాథం, గడిగ వెంకటేష్, రవి, , గట్టు, గొర్లఖాన్దొడ్డి, ఎక్లాస్పూర్ మరియు రాజోలి రాష్ట్రస్థాయి నుండి వివిద గ్రామాల నుండి వచ్చినటువంటి చేనేత కార్మికులు పాల్గొన్నారు.















