హైదరాబాద్ నవంబర్ 15 (ఈతరం ఇండియా న్యూస్);ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ వైస్ చైర్మన్ కే విజయ్ కుమారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ మాసబ్ ట్యాంక్ లోని బాల్ బడి పిల్లలకు మన దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన పిల్లల దినోత్సవం సందర్భంగా బాల బడి పిల్లలకు రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ సీనియర్ అడ్వైజరీ కమిటీ సభ్యులు బెజవాడ సుబ్బ లక్ష్మమ్మ, కృష్ణారెడ్డి దంపతుల చేతులు మీదుగా స్పోర్ట్స్ సామాగ్రిని మరియు బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమిరెడ్డి గారు మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటుగా శారీరకంగా దృఢంగా ఉండాలని వ్యాయామాన్ని కూడా పిల్లలు చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలని తెలిపారు. సినిమా హీరో శ్రీ తేజ, రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఏ.వి రావు గారు, రెడ్ క్రాస్ సికింద్రాబాద్ కన్వీనర్ ఆయూభ్ ఖాన్, మాజీ ఎం.సీ మెంబర్ మహమ్మద్ రియాజుద్దీన్, రెడ్ క్రాస్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ హెడ్మాస్టర్, టీచర్లు, హైదరాబాద్ జిల్లా శాఖ రెడ్ క్రాస్ సిబ్బంది వెంకట్ ,ఏపీ లక్ష్మి, సత్యలక్ష్మి ,సందీప్ ,గోపాల్ మరియు బాల్ బడి టీచర్లు పిల్లలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















